Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. గత ఏడాది “పుష్ప” సినిమాతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. “పుష్ప” రాకముందు కేవలం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే బన్నీకి ఫాలోయింగ్ ఉండేది. అది కూడా తెలుగు మరియు మలయాళంలో. కానీ ఎప్పుడైతే పుష్ప రిలీజ్ అయిందో.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బన్నీ మార్కెట్ పెరిగిపోయింది. పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఎవరు ఊహించని రీతిలో కలెక్షన్లు వసూలు చేయడం జరిగింది.
“పుష్ప” సినిమా పాటలు మరియు డైలాగులు బన్నీ వేసిన స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. సౌత్ ఇండియా ఫేమస్ ఫిలిం అవార్డు సైమా అవార్డ్స్ లో అనేక అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకా నేషనల్ అవార్డు కూడా రావటం జరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు బన్నీ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఈ అవార్డు వరుసగా రెండుసార్లు తనకి రావడం చాలా గ్రేట్ అని తెలిపాడు.. ఇదే సమయంలో వచ్చే ఏడాది కూడా అవార్డు వస్తుందని కచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని బన్నీ స్పష్టం చేశాడు.
గతంలో “అలా వైకుంఠపురంలో” సినిమాకి అవార్డు అందుకున్న బన్నీ… రెండోసారి “పుష్ప” సినిమాకి రీసెంట్ గా అందుకున్నాడు. ఈ క్రమంలో త్వరలో “పుష్ప” సెకండ్ పార్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కచ్చితంగా..”పుష్ప 2″కి కూడా అవార్డు అందుకోవటం జరుగుతుందని ఇన్ డైరెక్ట్ గా సినిమా విజయం పట్ల బన్నీ చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. “పుష్ప 2” రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఫస్ట్ పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ అత్యధిక భాషలలో రిలీజ్ చేయనున్నారు.