Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” సినిమా టీజర్ ఈరోజు ఉదయం విడుదల అయింది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సినిమాతో తమ అభిమాన హీరోకి భారీ హిట్ పడాలని కోరుకుంటున్నారు. కేజిఎఫ్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షేక్ చేయటం జరిగింది. ముఖ్యంగా “కేజిఎఫ్” సెకండ్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయ్యి దాదాపు ఈ కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హీరోయిజం ఎలివేషన్స్.. చాలా హైలెట్ గా చూపించడం జరిగింది. దీంతో ప్రభాస్ నీ కూడా అదే స్థాయిలో చూపిస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన “సలార్” టీజర్ లో బ్యాక్గ్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు హీరోఇజం ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించారు. ప్రభాస్ నీ కూడా పూర్తిస్థాయిలో చూపించలేదు. అంత మాత్రమే కాదు “సలార్” రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు… మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్నట్లు తెలియజేయడం జరిగింది.
తాజాగా విడుదలైన టీజర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ మాస్ లుక్..బీజీయం, ఎలివేషన్స్ మాత్రమే చూపించడం జరిగింది. ప్రభాస్ లుక్ కూడా పూర్తిస్థాయిలో చూపించలేదు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర పోషించాడు. మొదటి పార్ట్ సలార్ కి CEASE FIRE అని పేర్కొనడంతో రెండో పార్ట్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. మొదటి భాగం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుండగా.. రెండో భాగానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.