Salaar: శృతి హాసన్ కెరీర్లో మ్యాజిక్స్ జరిగిందే ఎక్కువ సార్లు అని చెప్పాలి. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శృతి ఆ తర్వాత సౌత్‌లో చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. అయితే, కెరీర్ ప్రారంభంలో శృతి హాసన్ వరుసగా ఫ్లాపులను మూటగట్టుకుంది. దాంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటివేమీ పట్టించుకోకుండా ఆయన హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. అప్పటి నుంచి శృతి కెరీర్ యూ టర్న్ తీసుకుంది.
చేసిన ప్రతీ సినిమాతో అటు తమిళంలో, ఇటు తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంది. క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ కెరీర్లో దాదాపు మూడేళ్ళకు పైగా బ్రేక్ వచ్చింది. ఎట్టకేలకు మళ్ళీ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. అలాగే, పవన్‌తోనూ వకీల్ సాబ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఇలా రెండు సినిమాలతో టాలీవుడ్లో మళ్ళీ క్రేజ్ ఆఫర్ అందుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే మెగా 154లో చిరు సరసన అవకాశం అందుకుంది.
Salaar: ఇలాంటి రోల్ శృతి కెరీర్లో ఇప్పటి వరకు చేయలేదట.
ఇక ప్రభాస్ సరసన సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్లో మైల్ స్టోన్‌లా మిగులుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇందులో శృతి హాసన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో ప్రభాస్‌తో పరిచయం ప్రేమ ఏర్పడతాయని కథలో ఆమెది అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర అని సమాచారం. ఇలాంటి రోల్ శృతి కెరీర్లో ఇప్పటి వరకు చేయలేదట. కాగా, ఈ మూవీలో ఆద్యగా నటిస్తోంది శృతి హాసన్.