న్యూస్ సినిమా

Salaar: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు

Share

Salaar: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఆయన చేస్తున్న క్రేజీ చిత్రాలలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సలార్ చిత్రం ఒకటి. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ప్రారంభంలోనే మొదలైంది. మొదట్లో చిత్రీకరణ వేగంగానే జరిపినప్పటికీ కరోనా వేవ్ కారణంగా, ఆ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టడంతో మధ్యలో సలార్ సినిమాకు బ్రేక్ పడింది. ఆదిపురుష్, సలార్ సినిమాల చిత్రీకరణలో సమాంతరంగా పాల్గొన్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసేశారు. ఒకవైపు రాధే శ్యామ్ సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తున్నారు.

salaar-shooting  is going to start again
salaar-shooting is going to start again

అంతేకాదు, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని ప్రకటించి ఊహించని షాకిచ్చాడు కూడా. ఈ కాంబినేషన్‌లో సినిమా అనేది ఒకటి ప్లాన్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ, మన పాన్ ఇండియన్ స్టార్‌కు కథ నచ్చితే చాలు దర్శకుడికి పది సినిమాల అనుభవం కావాలని ఇప్పుడు ప్రభాస్ ఏమాత్రం ఆలోచించడం లేదు. దర్శకుడిలో సత్తా ఉందా లేదా..అవకాశం ఇస్తే సినిమాను బాగా డీల్ చేస్తాడా లేదా అనే విషయాలను మాత్రమే చూస్తున్నాడు. అందుకే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సుజీత్, రాధాకృష్ణ లాంటి వారికి ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలు చేసే అవకాశాలు ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు సలార్ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కేవలం మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉంది.

Salaar: ప్రభాస్ సలార్ సినిమా కొత్త షెడ్యూల్‌లో జాయిన్..!

వాటిలో ఒక సినిమా రిలీజ్ కానేలేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలు కాస్త అటు ఇటుగా ఒకేసారి రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది ఆ దర్శకుడికి మూడవ సినిమా అవుతుందో కూడా ఇప్పుడే చెప్పలేము. అయితే, గతకొన్ని రోజులుగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ కె కోసం బల్క్ డేట్స్ ఇచ్చారని..దాంతో సలార్ ఇప్పట్లో మళ్ళీ సెట్స్ మీదకు వచ్చే సూచనలు లేవని ప్రచారం చేశారు. కానీ, తాజా సమాచారం మేరకు ఆల్రెడీ ప్రభాస్ సలార్ సినిమా కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారట. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి కాగా..మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసే వరకు ప్రభాస్ మరో సినిమా షూట్‌లో పాల్గొనరని అంటున్నారు.


Share

Related posts

రివ్యూ: ట్రైలర్ తోనే ఒళ్ళు గగురుపాటు కలిగిస్తున్న కీర్తి సురేష్ ‘పెంగ్విన్’

arun kanna

హైదరాబాద్ ‌లో హాట్ హాట్ రాజకీయం .. రాష్ట్రం మొత్తం ఇదే టాక్ !

sridhar

Nagarjuna: ఇజ్రాయేల్ దేశం పై మనసు పారేసుకున్న నాగార్జున..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar