న్యూస్ సినిమా

Salaar: ఆ అంచనాలు ప్రభాస్‌కు పెద్ద మైనస్ అవుతాయా..?

Share

Salaar: బాహుబలి సిరీస్ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన డార్లింగ్ ప్రభాస్ చిత్రాలు సాహో, రాధే శ్యామ్ ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ నుంచి వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోవడంలో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతేకాదు, ప్రభాస్ కూడా నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు చేస్తున్న సినిమాలలో సెట్స్ మీద సలార్, ప్రాజెక్ట్ కె ఉన్నాయి. సలార్ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడు.

salaar those expectations will become minus
salaar those expectations will become minus

ఇక మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె షూటింగ్ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయాల్సి ఉంది. కానీ, ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి చాలా సమయం ఉంది. ఇక త్వరలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా కూడా ఇదే. అందుకే, ప్రభాస్ ఈ సినిమా కోసం డేట్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు.

Salaar: కేజీఎఫ్ సినిమాలతో కంపేర్ చేయకుండా సలార్ చూస్తే..?

అయితే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్ 2 భారీ సక్సెస్ సాధించింది. ముందు నుంచి ఎలాంటి అంచనాలున్నాయో ఆ అంచనాలను మేకర్స్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఛాప్టర్ 2కి పాజిటివ్ రివ్యూస్ భారీ వసూళ్ళు వస్తున్నాయి. దర్శకుడికి క్రేజ్ రెట్టింపు అయింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా మీద భారీగా అంచనాలను పెంచుకుంటున్నారు. ఇది మైనస్ అవుతుందేమో అనే సందేహాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి. దానికి కారణం ప్రభాస్ గత చిత్రాల ఫలితమే. సలార్ మీద అంతగా
అంచనాలు పెంచుకుంటే ప్రశాంత్ నీల్ డిసప్పాయింట్ చేస్తాడా అని కామెంట్స్ వినిపిస్తున్నా యి. కేజీఎఫ్ సినిమాలతో కంపేర్ చేయకుండా సలార్ చూస్తే మాత్రం రిజల్ట్ ఎంతకాదన్నా వేరేలా వస్తుందనడంలో సందేహం లేదు.


Share

Related posts

Pawan Kalyan: పవన్ బర్త్ డే 50 రోజులకు ముందు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండింగ్..!!

sekhar

Engagement ring: ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి రింగ్ ని దొంగలించి వేరే అమ్మాయికి ఇచ్చి ఎలా దొరికిపోయాడంటే!!

Naina

SEC : పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాజా ఆదేశాలు..ఏమిటంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar