Chiru- Salman:తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో మంచి బిజీగా వున్నారు. ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయన ఇటీవల గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం విదితమే. ఇక షూటింగ్ నిమిత్తం ఇటీవల చిరంజీవి, గాడ్ ఫాదర్ టీం ముంబై వెళ్లారు. అక్కడ చిరంజీవి-సల్మాన్‌లపై యాక్షన్ సీన్సోతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
Chiranjeevi – Ram charan: ఆ మలయాళం రీమేక్ మెగా మల్టీస్టారర్‌గా రావాలంటున్న మెగా ఫ్యాన్స్..?
Chiru- Salman: మెగాస్టార్ కే కండీషనా?
అవును.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్, చిరుకు ఓ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో సల్మాన్ పాత్రపై చర్చలు జరుగుతున్న సమయంలో వీరి మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గాడ్ ఫాదర్ కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారని సల్మాన్‌ను దర్శక-నిర్మాతలు అడగ్గా.. ఒక్క పైసా వద్దని చెప్పాడట సల్లు భాయ్. ఇదే విషయాన్ని మేకర్స్ చిరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా దీంతో సల్మాన్‌ను అడిగారట. దీనికి సల్మాన్ తనకు ఎలాంటి పారితోషకం వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడట.
Chiranjeevi Salman: చిరంజీవి సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్..!!
మరి కండీషనేంటి?
పారితోషికం విషయంలో తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడట. అలా సల్మాన్ ఖాన్ ఒక్కపైసా తీసుకోకుండానే గాడ్ ఫాదర్‌కు వర్క్ చేస్తున్నాడట. అంతేగాక ఈ షూటింగ్ షెడ్యూల్ అయిపోయే వరకు సల్మాన్ ముంబైలోని తన ఫాం హౌజ్‌లో చిరు, గాడ్ ఫాదర్ టీం అతిథ్యం ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. కాగా సల్మాన్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారనే విషయం తెలిసిందే.