సినిమా

Salman Khan: డేంజర్ వ్యాధితో పోరాడుతున్న సల్మాన్.. సూసైడ్ దాకా ఆలోచన..!!

Share

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని క్రేజీ హీరో సల్మాన్ ఖాన్. గత కొద్ది సంవత్సరాల నుండి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి విజయాలు సాధిస్తూ ఉన్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రజెంట్ చాలామంది హీరోలు మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఆది నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫిజిక్ తో …. ఎప్పటికప్పుడు చాలా ఫిట్ గా బాడీ ని మెయింటేన్ చేసుకుంటూ ఉండే హీరో సల్మాన్ ఖాన్. ఇండస్ట్రీలోకి ఎంతమంది కుర్ర.. పాత హీరోలు ఉన్న సల్మాన్ బాడీ తీరే వేరు.

Salman battling Danger disease..with Suicide Thought

బాలీవుడ్ కండలవీరుడుగా పేరొందిన ఇటువంటి సల్మాన్ ఖాన్.. డేంజర్ వ్యాధితో బాధపడుతున్నట్లూ.. ఓ వార్త ఇప్పుడు మీడియా లో వినపడుతోంది. ట్రిజేమినల్ న్యూరల్జియా అనే ఓ వింత వ్యాధితో సల్మాన్ ఖాన్ పోరాడుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 వ సంవత్సరంలో వచ్చిన “ట్యూబ్ లైట్” మూవీ చేస్తున్న సమయంలో ఈ వింత వ్యాధి ఉంది అన్న విషయం బయటపడిందట. ప్రపంచంలో ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ట్రిజేమినల్ న్యూరల్జియా… సోకిన వారిలో ప్రధాన లక్షణం… నరాల సమస్యతోపాటు మూతి వంకర్లు పోవడం. ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు… ఎవరితోనైనా ఎక్కువసేపు మాట్లాడితే.. మూతి వంకర్లు పోతాయని ముఖభాగం భరించలేనంత నొప్పిగా ఉంటుందంట.

అయితే ఈ వ్యాధి గురించి ఇటీవల సల్మాన్ మాట్లాడుతూ… భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని.. షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి అమెరికాలో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సల్మాన్ చెప్పుకొచ్చారు. ట్రిజేమినల్ న్యూరల్జియా బారిన పడిన వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వంటి లక్షణాలతో కూడా ఉంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరమైన వ్యాధి తో పోరాడుతున్నా గాని సల్మాన్ ఎప్పుడు నొప్పిని బయట పెట్టకపోవడం గమనార్హం.


Share

Related posts

Bigg boss 4: మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్ టైన్ మెంట్ కు కాదు.. బిగ్ బాస్ స్టార్ట్ అయిందోచ్

Varun G

నితిన్ ప్ర‌యోగం

Siva Prasad

Shruthi Selvam Beautiful Looks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar