బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ విభిన్నమైన వ్యక్తి. పెద్ద స్టార్ హీరో అయినా కూడా చుట్టూ ఉన్న వారితో సరదాగా కలిసిపోతూ ఉంటారాయన. దబాంగ్ 3 షూటింగ్ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే పోతురాజు కుటుంబాలకు చెందిన కొంత మంది వక్యులను సల్మాన్‌ఖాన్ కలుసుకున్నారు. వారితో మాట్లాడటమే కాదు.. వారి కళను కూడా నేర్చుకునే ప్రయత్నం చేశాడాయన. వారిలాగానే తాను కూడా కొరడాతో కొట్టుకోవడం నేర్చుకున్నాడు. వారిని వారే కొట్టుకోవడం ..దాని వల్ల కలిగే బాధ వర్ణనాతీతమని ఆయన తాను కొరడాతో కొట్టుకునే సన్నివేశాన్నితన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వారి నొప్పిని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. సల్మాన్‌లాంటి స్టార్ హీరో ఇలా తాడు కొట్టుకోవడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!