GodFather: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో “ఆచార్య” సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అట్టర్ ఫ్లాప్ అందుకోవటం తెలిసిందే. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా చేయటం ఇదే సమయంలో ఫస్ట్ టైం చిరంజీవితో ఫుల్ లెన్త్ రోల్ లో రామ్ చరణ్ నటించిన భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ పరిణామంతో ఫుల్ నిరాశలో ఉన్న మెగా అభిమానులకు “గాడ్ ఫాదర్”తో బ్లాక్ బస్టర్ చిరంజీవి అందించడం జరిగింది. సినిమాలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా బ్రహ్మ పాత్రలో స్క్రీన్ మీద చెలరేగిపోయారు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా నాడు అక్టోబర్ 5వ తారీఖు విడుదల చేయడం జరిగింది. మొట్టమొదటి షో నుండి అన్నీ కూడా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరంజీవికి వీడియో రూపంలో కంగ్రాట్స్ తెలియజేశారు. ” మై డియర్ చిరు గారు.. ఐ లవ్ యు. సినిమా చాలా బాగుందని టాక్ వచ్చింది. అభినందనలు” అంటూ వీడియో రూపంలో సల్మాన్ ఖాన్ తన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
“గాడ్ ఫాదర్” సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడం జరిగింది. చిరంజీవి పాత్రకి సపోర్ట్ ఇచ్చే మాఫియా డాన్ గ్యాంగ్ పాత్ర చేశారు. సల్మాన్ ఖాన్ తన పాత్రకి తగిన న్యాయం చేశారని చూసిన జనాలు చెబుతున్నారు. దీంతో “గాడ్ ఫాదర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా యూనిట్ తో పాటు సల్మాన్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.