మ‌రొక‌రిని ప‌రిచ‌యం చేస్తున్న స‌ల్మాన్‌


బాలీవుడ్ హీరోయిన్స్‌కు సపోర్ట్ చేయ‌డంలో కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం `ద‌బంగ్ 3`. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుంది. ఈ సినిమా ద్వారా న‌టుడు, నిర్మాత అయిన మ‌హేశ్ మంజ్రేక‌ర్ త‌న‌య సాయి ఎం.మంజ్రేక‌ర్ ప‌రిచ‌యం కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈమె పాత్ర పేరు ఖుషీ. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. హిందీ స‌హా ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల‌కానుండ‌టం విశేషం.