Salman Khan: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమాలు అనేక సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు పుష్ప, RRR, బాహుబలి 2 రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం తెలిసిందే. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మరియు నిర్మాతలు దక్షిణాది టాలెంట్ నమ్ముకుని… సినిమాలో నిర్మించడంతో పాటు సినిమాలు ఓకే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎప్పటికీ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్… తమిళనాడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడం తెలిసిందే. “జవాన్” టైటిల్ పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది డైరెక్టర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హరీష్ శంకర్. గతంలో హరీష్ ముంబైలో సల్మాన్ ఖాన్ నీ కలవడం జరిగింది. అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ కి హరీష్ శంకర్ లవ్ స్టోరీ వినిపించినట్లు ఓకే అయినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో సల్మాన్ నటించిన “దబాంగ్” సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా “గబ్బర్ సింగ్” పేరిట రిలీజ్ కావటం తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు హరీష్ అద్భుతంగా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి అనేక రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో హరీష్ పనితనం మొత్తం తెలుసుకొని సల్మాన్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.