Salman Khan: భార్య, పిల్లల వదంతులపై సల్మాన్ స్పందన ఇదీ..!!

Share

Salman Khan: సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్ కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. తనపై సోషల్ మీడియాలో తరచూ అనేక కామెంట్స్ వస్తుంటాయి కానీ తాను అంతగా పట్టించుకోను అని తేల్చి చెప్పేశారు. నెగటివిటీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాజిటివ్ గా జీవించలేమని అన్నారు సల్మాన్.

Salman Khan on claims he has wife noor daughter in dubai
Salman Khan on claims he has wife noor daughter in dubai

Read More: YS Viveka Murder: ఆ ఇద్దరూ ఈ ఇద్దరేనా..!? వైఎస్ వివేకా హత్య ఆ రాత్రి జరిగిన రహస్యం..!?

ఇటీవల సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఓ సెలబ్రిటీ రియాల్టీ షో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలపై వచ్చిన సోషల్ మీడియా కామెంట్స్, వాటిపై స్పందన గురించి ఈ షో ఏర్పాటు చేయగా దానిలో సల్మాన్ సందడి చేశారు. అర్బాజ్ ఖాన్ షో విజయం సాధించాలని ఆకాంక్షించిన సల్మాన్ పై విధంగా స్పందించారు. అనంతరం ఓ నెటిజన్..”సల్మాన్ ఇంకా ఎంతకాలం దాస్తావ్ ? నీకు పెళ్లైందనీ, 17 ఏళ్లు వయసున్న అమ్మాయి కూడా ఉందని మాకు తెలుసు. వాళ్లిద్దర్నీ దుబాయ్ లో ఉంచావ్ కదా? అని కామెంట్ చేయగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు సల్మాన్. “ఈ నెటిజన్ ఎవరో కానీ అన్ని తెలిసినట్టే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. భారతదేశం మొత్తానికి తెలుసు, నాకు పెళ్లి కాలేదనీ, భార్య పిల్లలు నా జీవితంలో లేరనీ, అలాగే ఎన్నో సంవత్సరాల నుండి నేను ముంబయిలోనే ఉంటున్నాననీ, మరల ఈ నెటిజన్ ట్వీట్ పై స్పందించాల్సిన అవసరం ఏముంది” అని పేర్కొన్నారు.

ఇక సల్మాన్ మువీ విషయాలకు వస్తే గత సంవత్సరం రిలీజ్ అయిన రాథే తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం టైగర్ 3. టైగర్ చిత్రాల ఫ్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, ట్రైగర్ జిందా హై చిత్రాలను మించి ఈ మూడో చిత్రంలో యాక్షన్ ఉంటుందని టాక్. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మువీలో కత్రినా కైఫ్ కథానాయకగా సందడి చేయనున్నారు.

 


Share

Related posts

Riya Suman Gorgeous Photos

Gallery Desk

కేటీఆర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నేడు

Siva Prasad

చిత్తూరు జిల్లాలో వైసీపీ టిడిపి మధ్య ఫైట్ ; కార్లు ధ్వంసం

Special Bureau