Salman Khan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ కండల వీరుడుతో సినిమా చేయటానికి బడా బడా నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తూ ఉంటాయి. వయసు 50కి పైబడిన … సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కూడా భారీ బ్లాక్ బస్టర్ లు సాధించడం విశేషం. ఇదిలావుంటే ఇటీవల అబుదాబిలో ఐఫా సినిమా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ ఒక విషయం తెలియజేస్తూ వేదికపైనే కంటనీరు పెట్టుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళ్తే కెరీర్ స్టార్టింగ్ సమయంలో ఫస్ట్ సినిమా “మైనే ప్యార్ కియా” సినిమా రిలీజ్..అయి సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ క్రెడిట్ మొత్తం ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన.. భాగ్యశ్రీ క్రెడిట్ మొత్తం కొట్టేసింది. అయితే ఆ సమయంలో తనకి దాదాపు ఆరు నెలల పాటు అవకాశం రాలేదని చేతిలో పైసా లేని పరిస్థితి అని సల్మాన్ చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో రమేష్ తౌర అనే వ్యక్తి జీవితంలో దేవుడు లాగా వచ్చి.. ఒక ఫేక్ ప్రకటన తాను సినిమా చేస్తున్నట్లు పత్రికలలో ప్రచురించి తనని ఆదుకున్నాడనీ ఆ తర్వాత అవకాశాలు వచ్చాయని సల్మాన్ చెప్పుకొచ్చారు.
ఇంకో సందర్భంలో చేతిలో డబ్బులు లేని సమయంలో బాగున్న షర్ట్ లు చూస్తూ.. ఉండిపోవటం ఆ సమయంలో సునీల్ శెట్టి గమనించి తన కి గిఫ్ట్ గా నచ్చిన దుస్తులతో పాటు మంచి వాచ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇక కెరియర్ పరంగా ఫుల్ ప్లాప్ లలో ఉన్న టైంలో “వాంటెడ్” సినిమా చేయటంలో బోనీకపూర్ ఎంతో హెల్ప్ చేశారని పేర్కొన్నారు. ఈ రకంగా డబ్బులు లేని సమయంలో చాలామంది ఆదుకున్నారని అప్పటి చేదు జ్ఞాపకాలను అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకలో సల్మాన్ గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు.