NewsOrbit
Entertainment News సినిమా

Salman Khan: వాటికి కూడా సెన్సార్ ఉండాలంటున్న సల్మాన్ ఖాన్..!!

Share

Salman Khan: ఎంటర్టైన్మెంట్ రంగంలో గత రెండు సంవత్సరాల లో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా కాబట్టి థియేటర్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత సినిమా థియేటర్ బిజినెస్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఓటీటీ ఒక వరంలా మారింది. అంతకుముందు ఓటీటీ ఉన్న పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రజెంట్ మాత్రం సినిమా థియేటర్ బిజినెస్ కంటే ఓటీటీ బిజినెస్ మంచి లాభాలు తీసుకొస్తూ ఉంది. దీంతో పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ఓటీటీ కంటెంట్ కలిగిన ప్రాజెక్టులు చేస్తున్నారు. రకరకాల రియాల్టీ షోలు ఇంకా టాకీ షోస్ లో కనిపిస్తున్నారు. అయితే ఓటీటీ లకీ సెన్సార్ లేకపోవడంతో చాలా వల్గర్… బూతు కంటెంట్లు ఈమధ్య ఎక్కువైపోయాయి.

Salman Khan wants them to be censored too

పైగా చిన్న పిల్లలు సైతం ఓటీటీ లు చూస్తున్న రోజుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ సహా అన్ని మాధ్యమాలకు సెన్సార్ ఉండాలని కోరారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సమాజంలో 15 లేదా 16 సంవత్సరాల వయసున్న పిల్లలు దగ్గర సెల్ ఫోన్ ఉండటంతో పాటు ఓటిటి కంటెంట్… ఎక్కువగా చూస్తున్నారు. అయితే వాటిలో ఈ మధ్య ఎక్కువగా అసభ్యత, అసలీలత… బూతు పదాలతో కూడిన డైలాగులు ఎక్కువైపోయాయి. ఈ రీతిగా పిల్లలు చదువుకోకుండా అసభ్యకరమైన సంభాషణ వింటే భవిష్యత్తుకు ఇది చాలా ప్రమాదకరం. మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి కొన్నిటికి హద్దులు ఉండాలి అంటూ సల్మాన్..ఓటీటీ లతో పాటు మిగతా మధ్యమాలకు సెన్సార్ ఉండాలని కోరారు.

Salman Khan wants them to be censored too

ఇటీవల దగ్గుబాటి రానా.. వెంకటేష్ కలసి “రానా నాయుడు” అనే వెబ్ సిరీస్ చేయటం జరిగింది. చాలా దారుణంగా ఈ వెబ్ సిరీస్ లో కంటెంట్ ఉంది. పచ్చి బూతులు.. ఇందులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్… కొద్దిరోజులకే తీసేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఓటీటీ లకు సెన్సార్ ఉండాలని సల్మాన్ చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి.


Share

Related posts

నిహారికకు చిరంజీవి రూ 2 కోట్ల గిప్ట్… ఆ బహుమతి ఎంటో తెలుసా!

Teja

చిరూ-కొరటాల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది

Siva Prasad

RRR – PUSHPA: ఒకేరోజు రెండు పాన్ ఇండియన్ సినిమాల నుంచి భారీ సర్‌ప్రైజెస్…అప్పుడే ఓ క్లారిటీ కూడా వచ్చేస్తుంది..

GRK