Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిన్న రోల్ చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో ఉన్న అందరూ స్టార్ హీరోల దగ్గర్నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు దాదాపు అందరూ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇక మిగతా విభాగాలలోని అన్నీ టెక్నీషియన్స్ కూడా చిరు సినిమాలకు పనిచేయాలని తాపత్రయపడుతున్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆయనతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు లిస్ట్ చాలా పెద్దదే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తూనే మరో నాలుగు సినిమాలను పట్టాలెక్కించారు.
వీటిలో ఇప్పటికే మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, తమిళ హిట్ సినిమా వేదాళం తెలుగు రీమేక్ భోళా శంకర్, అలాగే బాబి దర్శకత్వంలో నటిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో రవితేజ కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇక భోళా శంకర్ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా ఆయనకు చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది.
Chiranjeevi: ఈ షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ వారం రోజులు హైదరాబాద్లో..!
అలాగే, గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించబోతుండటం. సల్మాన్ కొన్ని నిమిషాలపాటు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనుండగా ఇద్దరి మధ్య మాంచి జోష్ ఉన్న సాంగ్ కూడా ఉండబోతోంది. ఈ షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ వారం రోజులు హైదరాబాద్లో ఉండబోతున్నారట. చిరు – సల్మాన్ కలిసి వారం రోజులు సెట్లో సందడి చేయనున్నట్టు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక ఇద్దరు కలిసి సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా ఓ చరిత్ర సృష్ఠించే సీన్ అని చెప్పుకుంటున్నారు.