NewsOrbit
Entertainment News సినిమా

Salman Khan: మహిళల వస్త్రధారణ పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ “కిసి కి భాయ్ కిసి కి జాన్” సినిమాని రంజాన్ పండుగ నాడు విడుదల చేయడం తెలిసిందే. ఫస్ట్ టైం సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన భారీ తారాగణంతో సల్మాన్ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా షూటింగ్ సెట్ లో అందరూ మహిళలు తమ శరీరాలు పూర్తిగా ఒప్పుకోవాలని, “లో నెక్ లైన్” నిబంధన పాటించాల్సిందేనన్నారు. “ఆప్ కీ అదాలత్” టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ను “లో నెక్ లైన్” నిబంధన పై ప్రశ్నించగా… మహిళల శరీరాలు చాలా విలువైనవి కాబట్టి వారు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని పేర్కొన్నారు.

Salman Khan's sensational comments on women's dressing

ఇది ఒక్క మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పురుషులు కూడా తమ శరీరాలను బహిరంగపరచకూడదని.. అన్నారు. మహిళలు తమ శరీరాలను పూర్తిగా కప్పుకోకుండా చూపిస్తే… పురుషులు అదే పనిగా చూస్తారని… అది తనకి నచ్చదని సల్మాన్ చెప్పవచ్చారు. ఇక ఇదే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా తివారి కుమార్తె పలక్ తివారి… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫస్ట్ సినిమాలో ఎదురైన అనుభవం పంచుకున్నారు. సల్మాన్ సెట్ లో మహిళలు ధరించే అవుట్ ఫిట్ పై ప్రత్యేక నిబంధన ఉంటుందని వెల్లడించారు. అక్కడ లో “నెక్ లైన్” రోలు ఉంటుందని స్పష్టం చేశారు. “ఆప్ కీ అదాలత్” టీవీ కార్యక్రమంలో యాంకర్ సల్మాన్ ని మరో ప్రశ్న వేయడం జరిగింది.

Salman Khan's sensational comments on women's dressing

అమ్మాయిలు సరే మీరు ఓ జానే జానా పాటలో… బాడీ పై షర్ట్ లేకుండా కనిపించారు కదా అని ప్రశ్నించగా దానికి సల్మాన్ స్పందిస్తూ ఆ పాటలో తాను స్విమ్మింగ్ ట్రంక్స్ తో కనిపించానని అప్పుడు పరిస్థితులు కూడా వేరని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని మహిళలే కాదని పురుషులు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకోకుండా కనిపించవద్దని కోరారు. మహిళలను పురుషులు చూసేందుకు అదే కారణం అవుతుందని వివరించారు. ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలని అక్కలు, చెల్లెల్లు, భార్యలు మరియు తల్లులు కూడా మనం… అలా కనిపించడానికి ఇష్టపడడం అంటూ మహిళల వస్త్రధారణ గురించి సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.


Share

Related posts

Nivetha thomas : శాకినీ- ఢాకినీ ల మధ్య భారీ ఫైట్..!

GRK

Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్ డిసప్పాయింట్ చేసిందా..థమన్‌పై ఫ్యాన్స్ అసహనం..?

GRK

Devatha Serial: ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పిన రాధ.. రుక్మిణీ కి ఫోన్ ఇచ్చిన ఆదిత్య..!

bharani jella