సినిమా

Samantha: ఆ నొప్పి త‌గ్గ‌డానికి ఆరు నెల‌లు ప‌ట్టింది..సమంత కామెంట్స్ వైర‌ల్‌!

Share

Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ఆమె భ‌ర్త‌, యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. 2017లో గోవా వేదిక‌గా పెద్ద‌ల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అయితే ఏమైందో ఏమో కానీ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వీరిద్ద‌రూ విడాకులు వైపు అడుగు వేశారు. అప్పుడే వీరి విడిపోయి చాలా నెల‌లు కావొస్తోంది. ప్ర‌స్తుతం ఎవ‌రి లైఫ్ వారు చూసుకుంటున్న సామ్, చైలు.. కెరీర్ ప‌రంగా మ‌స్తు బిజీ అయ్యారు. ఇద్ద‌రూ వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్నారు.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. తాజాగా త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్‌చాట్‌ సెషన్‌ నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మంత అన్స‌ర్ చేసింది. అయితే ఇందులో భాగంగానే ఓ నెటిజ‌న్‌.. `మీరు మీ ఇయర్‌ పియర్సింగ్ ఎలా త‌గ్గించుకున్నారు..?` అంటూ ప్ర‌శ్నించాడు.

samantha

అందుకు ఆమె బ‌దులిస్తూ.. `ఈ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషం. నా బాధ చెప్పుకునే అవ‌కాశం వ‌చ్చింది. ఈ ఇయిర్‌ పియర్సింగ్‌ నొప్పి తగ్గడానికి సుమారు 6 నెలలు పట్టింది.` అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అలాగే ఈ చిట్‌చాట్ సెష‌న్ లో త‌న తొలి సంపాద‌న రూ. 500 అని, థియేటర్‌లో చూసిన ఫస్ట్‌ మూవీ జురాసిక్‌ పార్క్‌ అని, తానసలు టాటూలే వేయించుకోకూడదనుకున్నానని.. ఇలా ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది.


Share

Related posts

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

Ram Charan: హోటల్స్, హాస్పిటల్స్ ఉన్న సినిమాలు ఎందుకు చేస్తున్నారు..? చరణ్ ఆసక్తికర సమాధానం..!!

sekhar

Jr Ntr rejected movies : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమాల గురించి తెలిస్తే అభిమానులు తీవ్ర నిరాశ పడతారు.. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar