పెళ్ళి తర్వాత భర్త చైతన్యతో కలిసి ‘మజిలీ’లో నటించిన సమంత పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత విషయాల గురించి మాట్లాడింది. ‘‘నా నటన విషయంలో ఆ తేడాను నేను గమనించాను. పెళ్లికి ముందు నేను నటించిన ప్రతి సన్నివేశాన్ని నేను మానిటరింగ్ చేసుకుని నటించేదాన్ని. పెళ్లి తర్వాత నా భర్త నాగచైతన్య నటించే సన్నివేశాలను మానిటరింగ్ చేస్తున్నాను. అవన్నీ డైరెక్టర్ చూసుకుంటారు కదా అని చైతు అన్నప్పటికీ నేను ఊరుకోను. మేమిద్దం సెలబ్రిటీలమే. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మాపై అభిమానుల అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి మంచి కథా చిత్రాల్లోనే కలిసి నటించాలన్నదే ఆ ఒప్పందం. అలా నటించిన చిత్రమే `మజిలీ`. ఇకపై కూడా వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయాలన్నదే నా కోరిక. సినిమా విషయంలో నా శ్రద్ధ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ అయ్యింది. ఐదారు చిత్రాల్లో ఒకేసారి నటించడం కంటే మంచి కథా చిత్రం ఒక్కటి చేస్తే చాలు అని భావిస్తున్నాను. నిజ జీవితంలో నేను భావోద్రేకాలకు గురవ్వను. అలసిపోను. అందుకు విభిన్నంగా మజిలీ చిత్రంలో నటించాను. నాకు ఒక క్రీడాకారిణిగా నటించాలన్నది ఆశ. అదే విధంగా దివ్యాంగురాలిగానూ నటించాలని కోరుకుంటున్నాను. తమిళ చిత్రం `96` రీవేుక్‌లో నటించబోతున్నాను. ఇది మేలో సెట్స్‌కి వెళ్లబోతోంది. తాజాగా నటించిన `ఓ బేబీ ఎంత చక్కగున్నావే` చిత్రం త్వరలో తెరపైకి రానుంది’’ అని తెలిపింది సమంత.
previous post
next post