ఫిట్నెస్, డైట్ పేరు చెప్పగానే తెలుగు సినీ తారల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. అక్కినేని సమంత. అటు సినిమాలతో ఓ వైపు ఈమె బిజీగా ఉండడమే కాదు.. ఇటు ఖాళీ దొరికినప్పుడల్లా అనేక ఫిట్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కరోనా లాక్డౌన్ సందర్భంగా సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ఇంటి పని, తోట పనిచేసింది. అలాగే తీరిక వేళల్లో యోగా చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో సమంత తాను యోగా చేస్తున్న ఫొటోలను కూడా ఇటీవలి కాలంలో బాగానే షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సమంత చేస్తున్న యోగాసనాలకు చెందిన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి ఫన్నీగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో మీమ్స్ పేరిట వాటిని మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి పలు మీమ్స్‌ను సమంత తానే స్వయంగా ఎంపిక చేసి వాటిని షేర్ చేసింది. గతంలో వేసిన ఓ యోగా ఆసనంతోపాటు, ఇటీవల తాజాగా పోస్ట్ చేసిన మరో యోగా పోజ్ రెండూ స్పైడర్‌మ్యాన్ పోజ్లను పోలి ఉండడంతో.. ఫ్యాన్స్ ఆమెను స్పైడర్ వుమన్‌గా అభివర్ణిస్తూ.. ఆ యోగా ఫొటోలను మార్ఫింగ్ చేశారు. వాటిని సమంత షేర్ చేసింది.
https://www.instagram.com/p/CCGe–qlsgJ/?utm_source=ig_embed
ఇక చార్మినార్‌పై ఉన్నట్లుగా, ఇతర వ్యక్తుల మీద యోగా చేసినట్లుగా.. అనేక రకాలుగా సమంత ఫొటోలను పలువురు మార్ఫింగ్ చేసి మీమ్స్ రూపంలో వదిలారు. వాటిని కూడా సమంత ఏమాత్రం భయపడకుండా షేర్ చేయడం విశేషం. ఈ క్రమంలో సమంతపై వచ్చిన ఆ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!