Samantha: హీరోయిన్ సమంత మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గుర్తింపు సంపాదించడం జరిగింది. దక్షిణాది సినిమా రంగంలో అన్ని ఇండస్ట్రీలలో ఒక్క కన్నడ మరియు మలయాళం మినహా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోలందరి సరసను నటించింది. 2017లో అక్కినేని నాగచైతన్యాన్ని గ్రామ వివాహం చేసుకున్న తర్వాత.. కూడా సినిమాలలో రాణించడం జరిగింది. ఆ టైంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటింది. 2021లో విడాకులు తీసుకున్న తర్వాత.. కూడా పుష్ప ఇంకా “ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ ద్వారా సమంత చలనచిత్ర రంగంలో విజయవంతంగా రాణించింది.
ప్రొఫెషనల్ గా ఎంత సక్సెస్ సాధిస్తాదో అదే రీతిలో ఎంతోమందికి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. మానవతా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన సమంత చాలామంది అనాధలకు అభాగ్యులకు.. ఎన్నోసార్లు తన సొంత డబ్బుతో ఎన్నెన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆమె గురించి అసిస్టెంట్ ఆర్యన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత తనకు తల్లి లాంటిది అని అభివర్ణించాడు. గుంటూరు నుంచి తాను ఉపాధి కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాదులో బతకడానికి రకరకాల పనులు చేశాను తర్వాత ఫ్రెండ్స్ చలవతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఆ టైంలో కొందరు నటులు వద్ద అసిస్టెంట్ గా పనిచేశాను. ఈ రకంగా సమంత దగ్గర అవకాశం రావడం జరిగింది. దూకుడు సమయంలో ఆమె దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తూ కొత్త బైక్ కొనటానికి సమంతా మేడం హెల్ప్ చేయడం జరిగింది.
ఇంట్లో నుంచి వచ్చిన ఆరేళ్ల తర్వాత ఆ బైక్ పై గుంటూరు వచ్చినట్లు ఆర్యన్ చెప్పుకొచ్చాడు. అంతేగాదు సమంత మేడం తనతో ఆ బైక్ పై.. ప్రయాణించటం మాత్రమే కాదు ఎల్జి ఫోన్ కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా సాయపడినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత మణికొండలో తాను 3 బిహెచ్ కే ఇల్లు కొనుక్కోవడానికి కూడా సమంత తోడ్పాటు అందించినట్లు వివరించాడు. తన జీవితంలో దేవుడు గురించి మాట్లాడాల్సి వస్తే సమంత మేడం గురించే మాట్లాడతానని ఆర్యన్ పేర్కొన్నాడు. నాకు కొడుకు పుడితే సమంత జాను సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఉండి కూడా చూడటానికి వచ్చారు. నా బిడ్డను ఎత్తుకునే ఆమె ముద్దాడారు. ఆమె కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అని సమంత అసిస్టెంట్ ఆర్యన్ భావోద్వేగాలతో చెప్పుకొచ్చాడు.