Samantha: అలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు.. సమంత ఏంటి అంత మాట అనేసింది..!

Share

Samantha: సమంత.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఈ పేరు వింటే చాలు కుర్రోళ్లకి ఎక్కడలేని పూనకాలు వస్తాయి. అందంలో గాని., అభినయంలో గాని సమంత రూటే సపరేటు. ఏ పాత్ర అయినాగానీ ఇట్టే ఒదిగిపోతుంది. మొన్నటి రంగస్థలం సినిమా నుంచి నిన్నటి పుష్ప సినిమా వరకు సమంత యాక్టింగ్ కు ఎవరు కూడా పేరు పెట్టలేని విధంగా తన నటనతో అందరిని మెప్పించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకుని పోతుంది. చైతూని ప్రేమించి మరి పెళ్లి చేసుకుని, ఆ తరువాత కొన్నాళ్ళకు నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతుంది. సామ్ పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేస్తూనే వస్తుంది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది.

Karthika Deepam: ఇవాళ ఎపిసోడ్ లో బాబు తో ఉన్న దీప -కార్తీక్ లని చూసి ప్రేక్షకుల కంట్లో నీళ్ళు తిరిగాయి !

Samantha: సోషల్ మీడియాలో సామ్ వైరల్ పోస్ట్స్:

తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుని ఒక దృడమైన అమ్మాయిగా మారి లైఫ్ ను లీడ్ చేస్తుంది.. ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలాంటి ఎన్నో చేదు జ్ఞాపకాలను సైతం దిగమింగుకుని ఒక బలమైన మహిళగా, లేడీ సూపర్‌ స్టార్‌ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది సమంత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ పెడుతూ అందరిని ఎంతగానో ఆలోచింప చేస్తుంది. ఈమధ్య కాలంలో సమంత అమ్మాయిలు ఎలా పెరగాలి, ఎలా జీవితాన్ని నెట్టుకురావాలని అమ్మాయిలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది. అలాగే చైతూతో బ్రేకప్ అయిన తర్వాత తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. ముఖ్యంగా సామ్ నేటి తరాన్ని ఇన్‌స్పైర్‌ చేస్తు జీవిత పాఠాలను వెల్లడిస్తుంది.

Devatha Serial: రుక్మిణీని చూసిన వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్లిన సూరి.. చూసింది చెప్పేలోగా ఏమైందంటే.!?
అలాంటి వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదట.. ఇంతకు అతను ఎవరు..?

ఈ క్రమంలోనే సమంత తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసిన I’ve never met a strong person with an easy past” అనే పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నేను ఇంతవరకు సులభతరమైన గతం ఉన్న బలమైన వ్యక్తిని కలవలేదు” అని పేర్కొంది సమంత.అంటే గతం చాలా సులభంగా గడిచిపోతే ఆ వ్యక్తులు శక్తివంతంగా, బలంగా మారలేరని దాని అర్ధం అన్నమాట. అసలు సామ్ ఈ పోస్ట్ ద్వారా ఏమి చెప్పాలనుకుంటుందని ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు అందరు ఆలోచనలో పడ్డారు.. ఎందుకంటే సమంత విడాకులు తీసుకున్న తరువాత నుండి ఆమె మాటల్లో ఫిలాసఫీ వినబడుతుంది. అందుకే ఆమె ఏమి మాట్లాడిన దానిని లోతుగా ఆలోచిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పోస్ట్ ను బట్టి చూస్తే సమంత ఇంకా తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని, గతం తనని ఇంకా వెంటాడుతుందని, అందుకే ఆమె ఇలా పోస్ట్ ల రూపంలో తన బాధని పంచుకుంటుందని అంటున్నారు మరికొందరు నెటిజన్లు. ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే అన్నట్టు ఈ సమంత మాటలకూ కూడా అర్ధాలే వేరు అని మరికొందరు అంటున్నారు.

బిజీ లైఫ్ లో సమంత :

ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే పౌరాణిక చిత్రంలో నటించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలాగే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. మరోవైపు తమిళంలో, తెలుగులో కూడా కొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.


Share

Related posts

Pushpa: బాహుబలి సినిమాలా పుష్ప కథా గమనం..సుకుమార్ మీద సందేహాలున్నాయా..?

GRK

ఆ రీమేక్ సినిమాలో చిరంజీవితో విజయ్ దేవరకొండ..??

sekhar

వకీల్ సాబ్ టీజర్ లో ఫ్యాన్స్ ఫీలవుతున్న పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే ..?

GRK