Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సామ్.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. అలాగే మరోవైపు తన మొదటి సినిమా హీరో అయిన నాగచైతన్యనే ప్రేమించి 2017లో పెద్దల సమక్షంలో గోవా వేదికగా రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది.
కానీ, వివాహమై నాలుగేళ్లు గడవక ముందే చైతు, సామ్‌లు తమ వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేసేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత.. ఓ వాదన బలంగా వినిపించింది. సమంతను పిల్లలు కనమంటూ అక్కినేని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని.. కానీ, పిల్లలను కంటే అందం దెబ్బ తిని సినిమా అవకాశాలు తగ్గిపోతానే కారణంతోనే చైతుకు ఆమె విడాకులు ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు గర్భధారణకు మీరు వ్యతిరేకమా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా సామ్‌ను ప్రశ్నించారు.
అయితే ఈ ప్రశ్నకు తాజాగా సమంత పరోక్షంగా సమధానం ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. గత ఏడాది గౌతమ్ కిచ్లూతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట గౌతమ్ కన్ఫార్మ్ చేయగా.. ఆ తర్వాత కాజల్ ఓ వీడియో ద్వారా గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. దీంతో ఆమెకు విషెష్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కాజల్ ప్రెగ్నెన్సీపై సామ్ కూడా స్పందిస్తూ.. `అందమైన పడుచుపిల్ల ఎంత మెరిసిపోతుందో చూడండి. నీపై చాలా ప్రేమ ఉంది ప్రియమైన కాజ్…సంతోషంగాను ఉంది. చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను` అంటూ పేర్కొంది. ఇక సమంత చేసిన ఈ వ్యాఖ్యలతో తాను గర్భధారణకు వ్యతిరేకి కాదని చెప్పకనే చెప్పిసింది. మరియు గతంలో తనపై వచ్చిన ప్రచారాలు కేవలం పుకార్తే అని తేల్చేసింది.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…