Samantha:విడాకుల అనంతరం సమంత జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ కు స్టెప్పులేస్తోంది. గత కొన్ని వారాల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో సామ్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయని వేరే చెప్పనవసరం లేదు. ఇక లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా సమంతదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రెండు సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటిస్తోంది. ఒకటి శాకుంతలం కాగా రెండోది యశోధ.
Hyderabad News: తప్పతాగి.. ఆ యువతీ ఏం చేసిందో చూడండి..!!
Samantha: లైగర్ ఐటెమ్ సాంగ్ కోసం సమంత డిమాండ్స్ ఇవే..
సమంత మరో పాన్ ఇండియా చిత్రంలో ఐటెం సాంగ్ కు స్టెప్పులేయనుంది. అదే లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే రెమ్యూనరేషన్ విషయంలో సమంత అస్సలు తగ్గలేదట. దాదాపు ఈ పాట కోసం సమంత రెండు కోట్లు డిమాండ్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Ananya Nagalla: నడుమందాలతో సెగలు రేపిన `వకీల్ సాబ్` బ్యూటీ.. వామ్మో మరీ ఇంత అరాచకమా..?!
లైగర్ విషయాలు ఇవే…
బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మెరవనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ ఐటమ్ సాంగ్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో సమంతను ఏ రేంజ్ లో చూపిస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..