Samantha: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత హీరోయిన్ సమంత కేరియర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయింది. మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ… తన పాత్రకి ప్రాధాన్యత ఉండే ప్రాజెక్టులను సమంత లైన్ లో పెడుతూ ఉంది. బాలీవుడ్ అదేవిధంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం ఎక్కడ వచ్చినా వదలటం లేదు.
ఇక ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీ లో హీరో కార్తీ తో రీసెంట్ గా మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంత మాత్రమే కాక హాలీవుడ్ నుండి కూడా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్లు… ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల ఫోటో షూట్ లో కూడా సమంత పాల్గొన్నట్లు.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ యంగ్ హీరో తో ప్రేమ కథ నేపథ్యం కలిగిన సినిమా చేయటానికి సమంత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ… ఓ సినిమా చేయడానికి తాజాగా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. శివ నిర్వాణ, పూరి జగన్నాథ్ సినిమా కాకుండా ఇది మరో కొత్త ప్రాజెక్టు అని… ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని.. ఈ ముగ్గురిలో… ఒక పాత్ర కోసం సమంతా ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కొద్దిపాటి పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమా అన్ని.. అందుకే సమంత కూడా ఓకే చెప్పినట్లు టాక్.