Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత ప్రస్తుతం అక్కినేని కోడలిగా మరొక గుర్తింపును సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా ఫ్యాషన్ ని ఫాలో అవడంలో సమంత ముందు వరుసలో ఉంటారు. తన వేసుకున్న డ్రస్ పరంగా గానీ, అభిరుచుల పరంగా గాని సమంత ట్రెండ్ ఫాలో అవుతుంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉంటున్న సమంత తాజాగా పసుపురంగు డ్రెస్ ధరించి ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఆ డ్రస్ లో ఎంతో అందంగా ఉన్న సమంత ఎంతో మంది నెటిజన్లను తన వైపు తిప్పుకున్నారు ఈ అక్కినేని కోడలు. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఫ్యాషన్ ప్రియులు మాత్రం ఆ డ్రస్ ధర ఎంత ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సమంత డ్రెస్ గురించి తెలిస్తే షాక్ అవుతారు:
సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన దుస్తులను ధరిస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే సమంత వేసుకున్న ఈ పసుపు రంగు డ్రెస్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ డ్రెస్ ఖరీదు వేలల్లో ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఈ డ్రెస్ ధర కేవలం 1700 రూపాయలు మాత్రమే అంటూ సమంత తెలియజేశారు. ఈ డ్రెస్ లోఎంతో అందంగా ఉన్న సమంత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత “ది ఫ్యామిలీ మాన్ 2” అనే వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. అదే విధంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం”అనే సినిమాలో ప్రధాన పాత్రలో సమంత నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.