Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె తన భార్య నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురించి చేసింది. చైతుకు దూరం అయ్యాక కొద్ది రోజులు వరసగా వెకేషన్లకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న సమంత.. కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ `నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను` అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ మేఘన కోసం సామ్ అలా పోస్ట్ పెట్టింది. రీసెంట్గా సమంత మేఘనతో కలిసి కేరళలోని అలెప్పికి వెళ్లారు.
అక్కడ బీచ్ లో వీరిద్దరూ ఫుల్గా చిల్ అవుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ పిక్స్నే సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్.. అవి కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన `శాకుంతలం` మూవీతో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
అలాగే తమిళంలో `కాతు వాకుల్ రెండు కాదల్` అనే సినిమా చేస్తున్న సామ్.. `శాకుంతలం` అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్నూ టేకప్ చేసింది. ఇక వీటితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
https://www.instagram.com/p/CaM8TJchNp6/?utm_source=ig_web_copy_link