Samantha:సమంత శాకుంతలం అనే తెలుగు భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ శాకుంతలం. సినిమాను త్వరలో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాకు నిర్మాణంలో గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా చిత్రీకరణ ముగిసినగాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు.దింతో ఆగ్రహించిన ఫ్యాన్స్ సినిమా విడుదల ఎప్పుడు.. టీజర్ ఎప్పుడు.. అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు తమ అభిమాన హీరోయిన్ సమంత ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Samantha: సమంతని చాలా తక్కువ అంచనా వేశాము నాయనో.. ఏం చేసిందో చూడండి!
Samantha: ఆగ్రహంలో ఉగిపోతున్న సామ్ ఫ్యాన్స్ :
అసలు ఇప్పటివరకు సినిమా పోస్టర్ కూడా విడుదల చేయలేదని గుణశేఖర్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది. కనీసం ఇలా అయినాగానీ సమంత ఫస్ట్ లుక్ ను గుణశేఖర్ రివీల్ చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ప్రకటించే ఉద్దేశ్యంతో లేరని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు గాను ఈ సినిమా యూనిట్ సభ్యులు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్లుగా చెబుతూ ఒక వీడియోను విడుదల చేసారు. నిజానికి కొత్త సంవత్సరం లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నుగుణశేఖర్ టీమ్ విడుదల చేస్తారని భావిస్తే, గుణశేఖర్ మాత్రం తీరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండర్ ప్రోసెస్ అంటూ వీడియో విడుదల చేసాడు. దీనితో ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఏంటీ గుణశేఖర్ ఇది? అంటూ సమంత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Guppedentha manasu: సెల్ఫీ చూసి షాక్ అయిన రిషి.. ఇంతకీ ఎవరిదంటే..?
పాన్ ఇండియా మూవీగా శాకుంతులం అలరించునుందా..?
ఇదిలా ఉండగా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో సమంతతో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ కూడా కీలక పాత్రలో నటించాడు.ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్.అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా విడుదల గురించి కూడా ఇప్పటికి ఎటువంటి అప్ డేట్ అయితే లదు. అంతకుముందు ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కాని చూడబోతే ఈ సినిమాను సమ్మర్ లో కూడా విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు.