Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సమంత.. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతోంది. పాన్ ఇండియా సినిమాలు సైతం చేస్తోంది. అలాగే తాజాగా ఈ బ్యూటీకి కోలీవుడ్ నుంచి మరో బిగ్ ఆఫర్ వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లితో తన 66వ చిత్రాన్ని చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే విజయ్.. `మాస్టర్`తో తనకు మంచి హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తన 67వ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను సంప్రదించారట మేకర్స్. తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో సమంత వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇప్పటికే విజయ్‌తో సమంత కత్తి, తేరి, మెర్సల్ చిత్రాల్లో నటించింది.
విజయ్ 67లోనూ నటిస్తే వీరిద్దరూ నాలుగోసారి జత కట్టినట్లు అవుతుంది. మరి నిజంగా సామ్ నాలుగోసారి విజయ్‌కు ఓకే చెప్పిందా.. లేదా.. అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సిందే. కాగా, సమంత చేతిలో ప్రస్తుతం `శాకుంతలం`, `యశోద`, `ఖుషి`తో పాటు తదితర చిత్రాలు ఉన్నాయి.