సినిమా

Samantha: గుడ్‌న్యూస్ చెప్పిన స‌మంత‌.. ఇక ఆమెను ఎవ‌రూ ఆప‌లేరు!

Share

Samantha: స‌మంత‌.. ఈమె గ‌తం గురించి అంద‌రికీ తెలిసిందే. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడే యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, వీరి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. పెళ్లై నాలుగేళ్లు పూర్తి కాక‌ముందే సామ్‌, చైలు విడాకులు వైపు అడుగులు వేసి.. త‌మ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు.

ప్ర‌స్తుతం కెరీర్‌పైన మాత్ర‌మే ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. భాష‌తో సంబంధం లేకుండా వ‌రుస ప్రాజెక్ట్స్ ను టేక‌ప్ చేస్తూ ఎవ‌రూ ఆప‌లేనంత స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇక ఈమె చేతిలో ఉన్న చిత్రాల్లో `శాకుంత‌లం` ఒక‌టి. క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న ఈ విజువ‌ల్ వండర్ ను దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

పౌరాణిక నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను చూపించనున్నారు. శ‌కుంత‌లగా స‌మంత‌, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ కనిపించ‌బోతున్నారు. అలాగే ప్రిన్స్ భ‌ర‌త‌గా అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ అల‌రించ‌బోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి గ‌త కొద్ది రోజులుగా ఎటువంటి అప్డేట్ బ‌య‌ట‌కు రాలేదు.

దీంతో తీవ్ర ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్‌కు తాజాగా సామ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్‌ పూర్తి చేశానంటూ సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకుంది. ఈ అప్డేట్‌తో శాకుంత‌లం అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స్ప‌ష్ట‌మైంది.


Share

Related posts

Kota Srinivasarao: ‘మా’పై ‘కోట’ మాటల తూటాలు..! ఎవరిదా ప్యానెల్.. ఎక్కడిది..?

Muraliak

Jayamma Panchayathi: మొన్న పవన్ కళ్యాణ్.. ఇక ఈ సారి మహేష్ బాబు వంతు..!!

sekhar

Lata Mangeshkar: లతాపై విష ప్రయోగం..!? 50 వేల పాటలు.. మంగేష్కర్ జీవిత విశేషాలు..!

Ram