Samantha: వరుస పరాజయాలతో ఉన్న సమంత ఇటీవల “ఖుషి” సినిమాతో విజయం సాధించటం తెలిసిందే. “పుష్ప” సినిమా విజయం సాధించిన తర్వాత అందులో ఐటెం సాంగ్ “ఉ అంటావా ఊఊ అంటావా” అనే పాటకి డాన్స్ చేసి సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించటం జరిగింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురై సమంత ఇబ్బందులు పడటం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నటించిన యశోద, శాకుంతలం రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో సమంత డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అని ఇండస్ట్రీలో గుసగుసలు చేసుకుంటున్న సమయంలో “ఖుషి” సినిమాతో మంచి బంపర్ హిట్టు కొట్టి తన సత్తా నిరూపించింది.
ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీ లో ఉన్న సమంత ఇప్పుడు మరో ఖుషి లాంటి వార్త బాలీవుడ్ నుండి అందుకున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఏకంగా బాలీవుడ్ ఖండాలు వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో సమంతకి ఛాన్స్ రావటం జరిగిందట. ప్రస్తుతం సల్మాన్ “టైగర్ 3” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా అనంతరం స్టైలిష్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ఈ క్రమంలో సమంతా ని హీరోయిన్ గా తీసుకోవడానికి డిసైడ్ అయ్యారట.
సమంత ఆల్రెడీ “ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను అల్లరించటంతో..పాన్ ఇండియా నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో ఆమె అయితేనే కరెక్ట్ అని కరణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. వాస్తవానికి కృషి తర్వాత సమంత దాదాపు ఏడాది పాటు విదేశాలలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాకి భారీ రెమ్యూనరేషన్ నిర్మాత కరణ్ జోహార్ ఆఫర్ చేయడంతో స్క్రిప్ట్ కూడా నచ్చటంతో సమంత కూడా ఓకే చెప్పినట్లు టాక్.