సినిమా

Samantha: అదేంటబ్బా.. సమంతకు పుట్టినరోజు నాడు ఆశీస్సులకు బదులుగా ట్రోల్స్ లభించాయి!

Share

Samantha: సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే.. సినిమాతోనే తెలుగు కుర్రకారుని మాయచేసి హీరోయిన్ సమంత. ఇక ఆ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య కూడా ఆమె మాయలో పడేసి, పెళ్లి చేసుకొని తరువాత అనివార్య కారణాల వలన విడాకులు తీసుకున్నారు. సామ్ విడాకుల అనంతరం మరింత స్పీడు పెంచింది. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా పాత్రకు తగిన రీతిలో వైవిధ్య భరిత నటనను కనబరుస్తూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అందులో ఒకటే ఈ శాకుంతలం సినిమా.

Samantha got trolls instead of blessings on her birthday!
Samantha got trolls instead of blessings on her birthday!

సమంత-గుణశేఖర్ శాకుంతలం

వైవిధ్య భరిత సినిమా దర్శకుడు గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం హీరోయిన్ సమంతను ఎంచుకున్నాడు. ఒక్కడు సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చూపిన గుణశేఖర్ అనేక సినిమాలు చేస్తూ ముఖ్యంగా యువతకు చేరువయ్యే సినిమాలు చేస్తూ వుంటారు. ఇక తాను ఎప్పటినుండో అనుకున్న శాకుంతలం కధకు సామ్ అయితేనే న్యాయం చేస్తుందని తలచి ఆమెని పెట్టి నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈయన తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా శాకుంతలం పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది.

Samantha got trolls instead of blessings on her birthday!
Samantha got trolls instead of blessings on her birthday!

Samantha: సమంత బర్త్డే విశేషాలు

అవును.. నిన్న సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘శాకుంతలం’ మేకర్స్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టర్ పైన మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో ఆమె లుక్స్ అంతగా ఆకట్టుకోలేదని కొంతమంది నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. ఆమెలో ఉన్న ఒకనాటి క్యూట్నెస్ ఆ పోస్టర్ లో మిస్ అయిందని సామ్ అభిమానులు తెగ బాధపడిపోతున్నాడు. ఈ సందర్భంగా ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక శాకుంతలం కథ మహాభారతం ఆదిపర్వంలోని ‘శకుంతల దుష్యంతు’ల ప్రేమ కథ ఆధారంగా వెండితెరపై ఆవిష్కృతం కానుంది.


Share

Related posts

అన్న‌య్య అనుభ‌వాన్ని ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేరు: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

Siva Prasad

మ‌హేష్ బాట‌లో ఎన్టీఆర్‌…

Siva Prasad

KGF 3: “కేజిఎఫ్ 3” విలన్ పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో..??

sekhar