Samantha: అతి పెద్ద రూమర్ పై స్పందించిన సమంత.. హమ్మయ అనుకున్న నాగ చైతన్య ..!

Share

Samantha:  అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయం గంత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ విషయమై నాగచైతన్య కాని నాగార్జున కుటుంబీకులు కాని ఇంతవరకు అఫీషియల్‌గా స్పందించలేదు. కానీ, తాజాగా సామ్ ఈ విషయమై నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. క్లాత్ బ్రాండ్ ‘సాకీ’ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిన సందర్భంగా సామ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా నెటిజన్లు, అ‌భిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో సామ్‌ను ఫ్యాన్స్ డైవోర్స్ విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి సమంత సమాధానాలిచ్చింది.

Samantha: హైదరాబాద్‌లోనే సంతోషంగా జీవిస్తానంటున్న సామ్..

మీరు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది సామ్. తన ఇల్లు హైదరాబాద్‌లోనే ఉందని, తను ఇక్కడే సంతోషంగా జీవిస్తానని, హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఈ ఆన్సర్ ద్వారా తనకు చైకు ఎటువంటి విభేదాలు లేవనే వాదనకు బలం చేకూరుతున్నది. అయితే, మరి కొందరు నెటిజన్లు ఆమెను నాగచైతన్యతో వైవాహిక బంధంపైన కూడా ప్రశ్నించారు. కానీ, ఆ ప్రశ్నకు సమాధానమివ్వకుండా తప్పించుకుంది సామ్. ఒకవేళ చైతన్యతో కలిసి ఉండే ఆలోచన ఉండి ఉంటే స్పష్టంగా తాము కలిసే ఉంటామని ఎందుకు బదులివ్వలేదని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామ్ ‘సాకి బ్రాండ్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్’ సందర్భంగా అభిమానులతో ముచ్చటించినప్పటికీ తన పర్సనల్ లైఫ్ విషయమై పూర్తిగా స్పందించలేదని అర్థమవుతోంది.

Samantha: పెళ్లి రోజునే విడాకులపై స్పష్టత..

అక్టోబర్ 7న నాగచైతన్య-సమంత పెళ్లి రోజు కాగా ఆ రోజు వారి డైవోర్స్ ఉంటుందా? ఉండదా? అనే విషయమై ఫుల్ క్లారిటీ రానుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ దిశగా సాగుతున్న ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా తన కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అని నాగచైతన్య చెప్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మూవీ యూనిట్, హీరోయిన్ సాయిపల్లవితో కలిసి సెలబ్రేషన్స్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ సంబురాల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ కూడా పాల్గొనడం విశేషం. అయితే, చైతన్య తన పర్సనల్ లైఫ్, సమంతతో విడాకుల విషయమై వస్తున్న వార్తలపై స్పష్టంగా అయితే స్పందించలేదు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే అటువంటి వార్తలు రాస్తున్నారని బాధపడ్డారు. నాగచైతన్య అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో ‘బాలరాజు’ పాత్రను నాగచైతన్య పోషించినట్లు అమీర్ ఖాన్ తెలిపాడు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత నాగార్జునతో ‘బంగార్రాజు’ అనే చిత్రంలో చైతన్య నటించనున్నాడు. కల్యాణ్ కురసాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్.


Share

Related posts

ఏంటయ్యా నీ ప్రాబ్లం… ఢిల్లీ బీజేపీ రాజుగారిని కడిగేసిందా?

CMR

డెలివరీ తర్వాత చాలా తేలికగా బరువు తగ్గొచ్చు

Kumar

Rangamarthanda : రంగ మార్తాండ తో రాబోతున్న కృష్ణవంశీ..!

GRK