Samantha: సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం అమ్మడు తన సినిమా కెరీర్ ని ఎంజాయ్ చేస్తోంది. చైతో విడాకుల అనంతరం సామ్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు మంచి ఫలితాలే దక్కాయి. ఫామిలీ మాన్ II తరువాత అమ్మడు కెరీర్ మారిపోయింది. ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. దాని తరువాత వెంటనే ‘పుష్ప’ ఐటెం సాంగ్ చేసి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఆ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవడం చేత సమంత జీవితం మారిపోయింది. అందుకే ఇపుడు సామ్ ని అందరూ ‘పాన్ ఇండియా హీరోయిన్’ అని పిలవడం స్టార్ట్ చేసారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Samantha: ఈ సినిమా విషయంలోనే సామ్ బాధపడుతోందంట?
సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా “శాకుంతలం” అనే సినిమా గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ తెలుగు దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్లో త్వరలో విడుదల కాబోతోంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ పైన రెస్పాన్స్ పక్కన పెడితే, ఇంతవరకు ఈ సినిమా గురించి ప్రమోషన్స్ లేకపోవడం సామ్ కి ఒకింత బాధ కలుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొంతమందికి సమంత ఈ సినిమా చేస్తున్న సంగతి కూడా తెలీదు అని వినికిడి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంతకీ నిర్మాతలు ఎవరు?
ఇక ఈ సినిమాకి నిర్మాతగా దర్శకుడు అయినటువంటి గుణశేఖర్ వ్యవహరించడం కొసమెరుపు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. బహుశా డబ్బుల విషయంలో టైట్ అయి గుణ అలా చేస్తున్నాడనే రూమర్స్ వున్నాయి. అలాగే సినిమాపైనే వున్న నమ్మకంతోనే పబ్లిసిటీ పెద్దగా చేయట్లేదని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో సామ్ అభిమానులు మాత్రం ఒకింత మానసిక క్షోభకు గురి అవుతున్నారు. ఈ సినిమా కోసం సామ్ పడిన కష్టం మరియు చేసిన త్యాగాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయని అభిమానులు నిరాశ చెందుతున్నట్టు భోగట్టా. మరి ఈ విషయంలో మన గుణ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.