Samantha: సమంత.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత.. తన మొదటి సినిమా హీరో అయిన నాగ చైతన్యనే పెళ్లి చేసుకుంది. కానీ, వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే సామ్, చైలు తాము విడిపోతున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక చైతో విడిపోయిన తర్వాత తన దారి తాను చూసుకున్న సమంత.. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలను టేకప్ చేస్తూ దూసుకుపోతోంది.
అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న సమంత.. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో `లైఫ్‌లో తోబుట్టువుల మధ్య గొడవలు వస్తాయని నాకు ముందే తెలుసు అంటూ ` తన పెట్స్ గురించి సరదాగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో సామ్ వర్కవుట్స్ చేస్తుంటే.. తన పెట్స్ హాష్, సాషాలు గొడవ పడుతూ కనిపించాయి.
`హష్ తన వద్దకు వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. సాషా అయితే ఈ మధ్యే వచ్చింది. హష్, సాషాల మధ్య మొదట్లో అంత స్నేహం ఉండేది కాదు. కానీ, కొన్ని రోజుల తరువాత రెండూ బాగా కలిసిపోయాయి. ఇక ఇప్పుడు అవి కొట్టుకుంటున్నాయి.` అంటూ సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె పోస్ట్ వైరల్‌గా మారింది.