29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Samantha: తమిళనాడులో ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరోయిన్ సమంత..!!

Share

Samantha: హీరోయిన్ సమంత మయాసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ వ్యాధికి గురై దాదాపు మూడు నెలలు పాటు చికిత్స తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఒప్పుకున్న ప్రాజెక్టులను పక్కన పెట్టేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల మెల్లమెల్లగా రికవరీ అయ్యి యధావిధిగా గతంలో మాదిరిగా వర్క్ అవుట్ లు స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో అభిమానులు కొద్దిగా ఉత్సాహం చెందుతూ ఉన్నారు. అంతేకాదు మళ్ళీ షూటింగ్లకు కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Samantha special pujas at tamilnadu subramanya temple

ఇలాంటి దారుణంలో తమిళనాడులో సమంత ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి సమంతా ఈ రకంగా పూజలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “ఖుషి” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి “ఖుషి” సినిమా ఫిబ్రవరి 14వ తారీకు రిలీజ్ కావలసి ఉంది. కానీ సమంత అనారోగ్యానికి గురికావడంతో షూటింగ్ లేట్ కావటంతో ఈ సినిమా వాయిదా పడటం జరిగింది.

Samantha special pujas at tamilnadu subramanya temple

ప్రేమ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ జవాన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇది కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెబ్ సిరీస్ కూడా ఒప్పుకోవటం జరిగింది. త్వరలోనే ఈ రెండు షూటింగ్ లలో సమంత జాయిన్ కానున్నట్టు సమాచారం. చాలావరకు సమంతా రికవరీ కావడంతోపాటు వర్కౌట్స్ చేస్తూ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా త్వరగా పూర్తిగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.


Share

Related posts

Breaking: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ పేరు “భగత్ సింగ్”..??

sekhar

Samantha- Vijay Devarakonda: ‘ఖుషీ’గా వచ్చేసిన సమంత, విజయ్..!

Ram

బిగ్ బాస్ 4 : 70% అతనే విన్నర్..! సర్వేలు ఏం చెబుతున్నాయో చూడండి

arun kanna