Samantha: గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అంతకుముందు సౌత్ లో మాత్రమే టాప్ హీరోయిన్ క్రేజ్ ఉన్న సమంత ఆ తర్వాత పుష్ప ఐటమ్ సాంగ్ తోపాటు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ఎంతగానో పేరుని తీసుకొచ్చాయి. ఇటువంటి తరుణంలో సమంత చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు అందువల్లే అమెరికాకి వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అంతేకాదు చర్మంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో చేస్తున్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆపేసి.. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండి.. అమెరికాలో సమంత ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు టాక్ వచ్చింది.
ఈ విషయం నడుస్తూ ఉండగానే వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో సమంత ఆరోగ్యం పై వస్తున్న వార్తల విషయంలో ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. సమంత ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడటం లేదని తెలిపారు. వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. అంతేకాదు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేస్తున్న “ఖుషి” షూటింగ్ లో సమంత త్వరలో జాయిన్ కానున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం సమంత చేతిలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. ఒక్కసారిగా సైలెంట్ కావడంతో ఆమె ఆరోగ్యం పై రకరకాల ప్రచారం జరిగింది. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అందువల్లే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నట్లు.. ప్రచారం గట్టిగా జరిగింది. దీంతో ఆమె మేనేజర్ వచ్చి అవన్నీ గాసిప్స్ ఫేక్ వార్తలని.. క్లారిటీ ఇవ్వటంతో సమంత స్కిన్ పై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.