Samantha: సమంత ఇటీవల ఖుషి సినిమాతో హిట్టు అందుకోవటం తెలిసిందే. ఈ సినిమా రాకముందు మయోసైటీస్ అనే వ్యాధితో బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమె నటించిన యశోద, శాకుంతలం రెండు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కెరియర్ పరంగా సమంత ఎదురుగాలి ఎదుర్కొంటున్న సమయంలో ఖుషి రూపంలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఒప్పుకోకముందు సమంతా కి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. ఆ సినిమా చేసిన హీరోయిన్ లేటెస్ట్ గా “ఖుషి” కంటే పెద్ద హిట్ అందుకోవటం జరిగిందంట. దీంతో రీసెంట్ గా సినిమా ఫలితం తెలుసుకుని.. అనవసరంగా సినిమా చేయలేకపోయాను అని.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ సమంత తెగ బాధపడుతూ ఉందట.
అంతేకాదు ఆ సినిమా విజయం సాధించిన హీరోయిన్ నీ సమంతా తాజాగా ప్రశంసించింది. విషయంలోకి వెళ్తే ఆ హీరోయిన్ మరెవరో కాదు స్వీటీ అనుష్క. ఇటీవల అనుష్క “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమా చేయడం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిగా హీరో పాత్ర ఉంటుంది. హీరో కంటే పెద్ద వయసు కలిగిన హీరోయిన్ పాత్రలో మెప్పించారు. ఈ సినిమా విజయం సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, ఎస్ ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించడం జరిగింది. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా యూనిట్ నీ అభినందించింది. ఇటీవల కాలంలో ఈ రకంగా ఏ సినిమా కూడా తనని నవ్వించలేదు అని చెప్పుకొచ్చింది.
సినిమాలో అనుష్క చార్మింగ్ గా కనిపించింది. నవీన్ పోలిశెట్టి సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్మెంట్ చేశాడు. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా యూనిట్ అందరికీ కంగ్రాట్స్ అని తన శుభాకాంక్షలు తెలిపింది. ఒక సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ తగ్గట్లే వసూలు కూడా రాబడుతూ ఉంది. యూఎస్ లో 550K డాలర్స్ మార్క్ అందుకున్న ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ అందుకోవడానికి అతి చెరువులో ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీతో ఈ సినిమాని మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించగా..పి. మహేష్ బాబు దర్శకత్వం వహించారు. దీంతో వాస్తవానికి ఏ సినిమా స్టోరీ మొదట సమంత దగ్గరికి వచ్చినట్లు ఆమె రిజెక్ట్ చేయడంతో అనుష్కకి వినిపించగా ఆమె ఒప్పుకోవటంతో.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” హిట్ అనుష్క కథలో పడినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే సమంత రిజెక్ట్ చేయడానికి కారణం హీరోయిన్ కంటే హీరో వయసు తక్కువ కావడంతో ఆ పాయింట్ సమంతకి నచ్చలేదంట. అందువల్లే ఈ సినిమా చేయనట్లు సమాచారం.