Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.. సమంత మయోసైటిస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా సమంత ఇంట్లోనే ఉంటూ ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనున్నది. ఈ సందర్భంగా సమంత తమ అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
సమంత తన ఇన్స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ పిక్ ను పోస్ట్ చేస్తూ.. మీరు చేయగలిగిన వాటినే చేయండి. మిగతా వాటిని నియంత్రించండి.. కొత్తగా చేసే సులువైన లక్ష్యాలకు ఇదే సరైన సమయం. మనం చేయగలిగే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. మన అందరి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్ 2023..’ అంటూ పోస్ట్ చేసింది.. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సమంతకు విషెష్ చెబుతున్నారు.
https://www.instagram.com/p/CmwDaacL-oC/?igshid=NDdhMjNiZDg=
ప్రస్తుతం సమంత చేసిన పోస్టును దీర్ఘంగా ఆలోచిస్తే తను ఎంత ఎమోషనల్ అవుతూ ఈ పోస్ట్ చేసిందో అర్థమవుతుంది.. సమంత ఆరోగ్యం పై ఆమె అభిమానులందరికీ దిగులుగా ఉంది.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.. మరికొంతమంది సమంత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ చూడాలని ఉంది అంటూ పోస్టులు చేస్తున్నారు. మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మేమందరం దేవుడికి ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉన్నాము మీరు ఎమోషనల్ గా ఇంకా వీక్ అవ్వకండి అంటూ సమంతకి మనోధైర్యాన్ని అందిస్తున్నారు ఫాన్స్ సమంతకి లవ్ ఎమోజిస్ ను షేర్ చేస్తూ 2023 శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మంచే జరగాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?