Subscribe for notification
Categories: సినిమా

Samantha: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న స‌మంత సినిమా.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

Share

Samantha: స‌మంత న‌టించిన తాజా చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధం అయింది. ఇంత‌కీ ఆ సినిమా మ‌రెదో కాదు `కణ్మ‌ణి రాంబో ఖతీజా`. ఇందులో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించ‌గా.. న‌య‌న‌తార‌, స‌మంత‌లు హీరోయిన్లుగా చేశారు. న‌య‌న్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై విగ్నేశ్‌ శివన్, నయనతార, ఎస్.ఎస్.లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మించారు రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకుంది. కానీ త‌మిళంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తో కూడా సూపర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది.

ఇక‌పోతే క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌లైన చిత్రాల‌న్నీ మ‌ళ్లీ ఓటీటీ వేదిగా స్ట్రీమ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కణ్మ‌ణి రాంబో ఖతీజాను ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. త‌మిళంలో ఈ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ కణ్మ‌ణి రాంబో ఖతీజా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సాలిడ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంది.

అలాగే స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేసింది. హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు పోటీ ప‌డి న‌టించారు. అనిరుధ్ ఇచ్చిన పాటలు, కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆక‌ట్టుకుంటాయి.


Share
kavya N

Recent Posts

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

1 hour ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

9 hours ago