సినిమా

Samantha: అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏదైనా చేయ‌గ‌ల‌ను.. స‌మంత షాకింగ్ కామెంట్స్‌!

Share

Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌క్క‌ర్లేదు. `ఏ మాయ చేశావే` చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల భామ‌.. త‌న‌దైన టాలెంట్‌తో అన‌తి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అలాగే కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు త‌మ మొద‌టి సినిమా హీరో అయిన నాగ‌చైత‌న్య‌ను గోవాలో వైభ‌వంగా వివాహం చేసుకుని అక్కినేని ఇంటికి కోడ‌లు అయింది.

అయితే ఏమైందో ఏమో కానీ.. కొన్ని నెల‌ల క్రితం చైతు, సామ్‌లు విడిపోయారు. ప్ర‌స్తుతం ఒంట‌రిగా జీవిస్తున్న స‌మంత‌.. కెరీర్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టి వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. న‌యా ఫొటో షూట్ల‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా కూడా హాట్ ఫొటోల‌ను షేర్ చేసిన స‌మంత‌.. కాక‌రేపే విధంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా సమంత ఓ మ్యాగజైన్‌ కోసం నెమలి తరహా విభిన్నమైన వస్త్రధారణతో ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసిన సామ్‌.. `చాలా ప్రాజెక్ట్‌లలో పనిచేసిన తర్వాతే నేను ఎక్కువ నమ్మకంతో ఉన్నానని చెప్పగలను. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది.

నేను నా సొంత ఛరిష్మాతో సుఖంగా ఉండటానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు నేను సెక్సీ సాంగ్ అయినా, హార్డ్ కోర్ యాక్షన్ అయినా, విభిన్నమైన పాత్రలు అయినా చేయ‌గ‌ల‌ను అని చెప్ప‌డానికి చాలా నమ్మకంగా ఉన్నాను. ఇలాంటివి బహుశా గతంలో అయితే చేసి ఉండేదాన్ని కాదేమో. అప్పుడంత ధైర్యం నాకు లేదు.` అని పేర్కొంది. దీంతో స‌మంత ఫొటోల‌తో పాటు ఆమె కామెంట్స్ సైతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CdP4kvzrGy-/?utm_source=ig_web_copy_link


Share

Related posts

Goodachari 2 : అందుకే గూఢచారి 2 ఆలస్యం…అడవి శేష్

GRK

Acharya : ఆచార్య సినిమాలో చిరంజీవి కంటే చరణ్ దే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ..?

GRK

చిరు పొలిటికల్ పయనం..! మూడు కూడళ్లలో ఎటువైపు..??

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar