సినిమా

Samantha: రెడ్ ఆపిల్‌లా మెరిసిపోయిన‌ స‌మంత‌.. స‌మ్మ‌ర్‌లో ఈ హీట్ ఏంటో..?

Share

Samantha: స‌మంత వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. త‌న మొద‌టి సినిమా హీరో అయిన అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ఏడేళ్ల పాటు ప్రేమాయ‌ణం న‌డిపించిన స‌మంత‌.. 2017లో గోవా వేదిక‌గా అత‌డితో క‌లిసి ఏడ‌డుగులు న‌డిచింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు అవ్వ‌క‌ముందే ఈ జంట వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికి విడాల‌కు వైపు ట‌ర్న్ తీసుకున్నారు.

నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తున్న స‌మంత‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ గ్లామ‌ర్ షోతో త‌గ్గేదే లే అన్న చందంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ పీకాక్ మ్యాగజైన్ కోసం విభిన్నమైన వస్త్రధారణతో ఫొటో షూట్స్‌లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రెడ్ క‌ల‌ర్ అవుట్ ఫిట్‌లో రెడ్ ఆపిల్‌లా మెరిపిసోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఆ ఫొటోల‌ను సామ్ త‌న్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయ‌గా.. అవి కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజ‌న్లు.. స‌మ్మ‌ర్‌లో సామ్ మ‌రింత హీట్ పుట్టిస్తుంద‌ని, సామ్ సెగ‌ల‌కు చెమ‌టలు ప‌ట్టేస్తున్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నాయి. మొత్తానికి పీకాక్ మ్యాగజైన్ కవర్ షూట్ అదిరిపోయింద‌నే చెప్పాలి.

కాగా, స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌త‌క‌త్వంలో `శాకుంత‌లం`, హరి- హరీష్‌ల డైరెక్ష‌న్‌లో `య‌శోద‌` చిత్రాలు చేసింది. షూటింగ్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వీటినితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం సామ్ చేతిలో ఉన్నాయి.


Share

Related posts

Liger: విజ‌య్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. `లైగర్` హంట్ థీమ్ అదుర్స్ అంతే!

kavya N

స్పెషల్ గెస్ట్ పై ముద్దుల వర్షం కురిపించిన ప్రియమణి..! ఢీ షో లో ఆది కి అవమానం

arun kanna

Sanjana Singh Latest Pictures

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar