samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది నెలల క్రితమే భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఎవ్వరేమనుకున్నా తన దారి తనదే అన్నట్లుగా దూకుడు చూపిస్తోంది.
ఇకపోతే సామ్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఇంట్లో కంటే జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంటుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. వర్కౌట్స్ చేయకుంటే సామ్ రోజు కూడా గడవదు. తాజాగా కూడా ఈ భామ టైట్ ఫిట్ డ్రస్ ధరించి ట్రెయినర్ సమక్షంలో భారీ కసరత్తులు చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన సమంత.. ` స్ట్రోంగ్ బాడీ.. స్ట్రోంగ్ మైండ్` అని కూడా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. సమంత ముందు స్టార్ హీరోలు కూడా దగదుడుపే, ఫైర్, వావ్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె నటించిన `శాకుంతలం` చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఈమె చేసిన `కాతువాకుల రెండు కాధల్` త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు శ్రీదేవి మూవీస్ పతాకంపై `యశోద` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తోంది. ఇది ఆగస్టు 12న రిలీజ్ కానుంది. వీటితో పాటే సామ్ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
https://www.instagram.com/tv/CcYFzGmhrpp/?utm_source=ig_web_copy_link