Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటీస్ అని అరుదైన వ్యాధికి గురై చికిత్స సమయంలో ఒంటిలో శక్తి చాల కోల్పోవడం జరిగింది. దీంతో “ఖుషి” సినిమా విజయం సాధించిన వెంటనే.. సమంత విదేశాలకు వెళ్లిపోవడం తెలిసిందే. అక్కడ పూర్తిస్థాయిలో కోలుకుని పలు చికిత్సలు తీసుకుంటూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ రకరకాల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో సామ్ పోస్ట్ చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ఈ ఏడాది షారుక్ ఖాన్ రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవటం తెలిసిందే. మొదటిది “పఠాన్”, రెండవది “జవాన్”. ఈ రెండు సినిమాలు ₹1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది.
సెప్టెంబర్ నెలలో “జవాన్” సినిమా విడుదలయ్యింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్… డ్యూయల్ రోల్ పోషించడం జరిగింది. షారుఖ్ అభిమానులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. “జవాన్” కమర్షియల్ విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చాలావరకు దక్షిణాది సినిమా రంగానికి చెందిన వాళ్లే చేశారు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. హీరోయిన్ గా నయనతార నటించడం జరిగింది. సినిమాలో నయనతార చేసిన యాక్షన్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో నర్మదా పాత్రలో నయనతార నటించడం జరిగింది. ఇదిలా ఉంటే అసలు నయనతార చేసిన నర్మదా పాత్రకి ఫస్ట్ సమంతాన్ని డైరెక్టర్ అట్లీ అనుకున్నారట. అప్పట్లో సమంతాతో తేరి, మెర్షల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో 2019లో “జవాన్” సినిమాలో హీరోయిన్ పాత్రకి సంబంధించి స్టోరీ సమంతకి చెప్పారట. అయితే ఆ సమయంలో ఇంకా విడాకులు తీసుకోకపోవడంతో నాగచైతన్య.. వద్దన్నారట. 2017లో సమంత, నాగచైతన్య పెళ్లి అయింది. 2021లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మధ్యలో సరిగ్గా 2019లో బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం రాగా చైతు కారణంగా సమంత డ్రాప్ కావడం జరిగింది అంట. ఈ సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. ప్రస్తుతం సమంత విదేశాలలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. “ఖుషి” తర్వాత ఆమె మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మళ్లీ వచ్చే ఏడాది సమంత సినిమాలు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్టులపైనే సమంత దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ “ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ తో అందరిని ఆకట్టుకుంది. దీంతో బి టౌన్ నుండి కూడా సమంతకి భారీగా ఆఫర్లు వస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.