Samantha: జోరుమీదున్న సమంత.. OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టులో టాప్ ప్లేస్!

Share

Samantha: సమంత.. నిన్న మొన్నటివరకు ఓ ఫామిలీ హీరోయిన్. ఏ మాయ చేసావేతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత, ఆనతి కాలంలోనే స్టార్ హీరయిన్ గా వెలుగొందారు. దానికి కారణం ఆమె చేసిన పాత్రలే. అవును.. దాదాపుగా చీరకట్టులో కనిపిస్తూ ముఖ్యంగా ఫామిలీ ఆడియన్సును బాగా ఆకట్టుకుంది. మొన్నటి వరకు అటువంటి పాత్రలే చేసిన సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో రాజీ పాత్రలో ఒదిగిపోయారు. పాత్ర పరిధి మేర హాట్ పెర్పార్మెన్స్ ఇచ్చారు అందులో. అంతగా సామ్ పాత్ర పండింది. దాంతో అవార్డులు.. రివార్డులు సైతం సామ్ ను వెతుక్కుంటూ వచ్చాయి.

Acharya: ఆచార్య నుంచి హై వోల్టేజ్ సాంగ్.. మూవీ యూనిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్

OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టు ఇదే:

తాజాగా OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల జాబితా రిలీజ్ చేసింది. అందులో సమంతకు 4వ స్థానం దక్కడం విశేషం. ఇక ఈ రేసులో రాధికా ఆప్టే 5వ స్థానంతో సరిపెట్టుకుంది. మొదటి స్థానంలో మనోజ్ భాజ్ పాయ్.. 2వ స్థానంలో మనోజ్ త్రిపాఠి.. 3వ స్థానంలో నవాజుద్దీన్ సిద్దిఖీ నిలిచారు. మొత్తానికి సమంతకి ఈ ఏడాది వ్యక్తిగత జీవితం కలకలం సృష్టించినా వృత్తి పరంగా మాత్రం మరింత మెరుగ్గానే కనిపిస్తోంది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ నటిగా సామ్ ఐడెంటీటీ దక్కించుకోవడం విశేషం.


YCP MLA: నేను అలా అనలేదు..! ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ సమాధానం..!!
మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జావితాలో కూడా ఈమెదే పైచేయి!

ఇకపోతే గూగుల్ సెర్చ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జావితాలో కూడా ఈవిడే ముందంజలో ఉండటం కొసమెరుపు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ మొక్కవోని దీక్షతో సామ్ ముందుకు దూసుకు పోతుంది. ఇటు టాలీవుడ్ తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘యశోద’ అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో సమంత లీడ్ రోల్ లో నటిస్తోంది.


Share

Related posts

F 3 : ఎఫ్ 3 లో తమన్నా, మెహ్రీన్ తో పాటు వకీల్ సాబ్ హీరోయిన్ కూడా..?

GRK

మెగా డాటర్ కమిట్‌మెంట్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ …!

GRK

నాని కొత్త చిత్రం.. హీరోయిన్ ఫిక్స్‌

Siva Prasad