Salman Samantha: గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా సమంత దూసుకుపోతుంది. సౌత్ నుండి బాలీవుడ్ వరకు అవకాశాలు అందుకుంటూ ఒకపక్క సినిమాలు ఒప్పుకుంటూ మరోపక్క వెబ్ సిరీస్ లతో విజయవంతంగా రాణిస్తోంది. “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత బన్నీ నటించిన “పుష్ప” లో ఐటెం సాంగ్ తో హిందీలో సమంత మరింత పాపులర్ అయ్యింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత హీరోయిన్ గా చేయటానికి రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ టాక్ బాలీవుడ్ మీడియాలో వినబడుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో 2005వ సంవత్సరంలో విడుదలైన “నో ఎంట్రీ” సినిమాకు తాజాగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అప్పట్లో అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాత. అనీల్ కపూర్, సల్మాన్, ఫర్దీన్ ఖాన్ హీరోలుగా నటించగా, బిపాషాబసు, ఇషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీలు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఎస్.వి.కృష్ణారెడ్డి తెరకెక్కించిన “పెళ్ళాం ఊరెళితే” సినిమా హిందీ వర్షన్.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి “నో ఎంట్రీ 2” సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాలో సల్మాన్ ఖాన్ భార్యగా సమంత నటించనున్నట్లు టాక్. అంతా ఓకే అయితే సమంత ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లే. అంతమాత్రమే కాదు “నో ఎంట్రీ” సినిమాల్లో నటించిన అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్.. కూడా నటించనున్నట్లు ఇంకా పది మంది సీనియర్ హీరోయిన్స్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…
Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…