Samantha: బేసిగ్గా సమంతకి సినిమా కధలపైన మంచి పట్టు వుంది. అందుకే మాక్సిమం సామ్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఆవిడని అందరూ లక్కీ లేడి అని అంటూ వుంటారు కదా. ఇది పచ్చి అబద్దం. అదృష్టం వుంది కాబట్టి ఆమె సినిమాలు హిట్లవ్వలేదు. కేవలం కధలపైన ఆమెకున్న కమేండ్ వలన ఎన్నో హిట్ చిత్రాలలో ఆమె నటించింది. ఇక ఈ క్రమంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ కధలను కూడా రిజక్ట్ చేసిన దాఖలాలు లేకపోలేదు. కథ నచ్చకో, డేట్స్ కుదరకో.. ఇలా కారణం ఏదైతేనేం, ఆమె కూడా కొన్ని మంచి చిత్రాలను అవాయిడ్ చేసింది.
Chiranjeevi: ఆహా ఓటిటి “అన్‌స్టాపబుల్” టాకీ షోలో చిరంజీవి..??
Samantha: ఆమె అవాయిడ్ చేసిన చిత్రాలు:
ఈ మధ్య రిలీజైన హిట్ చిత్రం ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత నర్తించి, మాయ చేసిన సంగతి తెలిసినదే కదా. ఇకపోతే ఈ సినిమాకు ఐటెం సాంగ్ కంటే ముందు శ్రీవల్లి క్యారెక్టర్ కోసం సమంతనే ముందు సంప్రదించారట. కానీ ఆమె ఆఫర్‌ను తిరస్కరించడంతో రష్మిక మందన్న లైన్లోకి వచ్చింది. అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాని కూడా సమంత రిజెక్ట్ చేసిందట. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ చిత్రాన్ని కూడా సమంత అవాయిడ్ చేసింది.
e
YS Jagan Chiranjeevi: నేడు జగన్ తో చిరు బృందం భేటీ.. జరగబోయేది ఇదే..!!
సామ్ వదిలేసిన మరికొన్ని:
నాని నటించిన ‘నిన్నుకోరి’ సినిమా కోసం మొదట సమంతనే అడిగారట. కానీ ఆమె తిరస్కరించడంతో ఆ క్యారెక్టర్ నివేదా థామస్‌ని వరించింది. ఇక ఈ సినిమా యువతను ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన పని లేదు. ఆమధ్య రిలీజైన లవ్ స్టోరీలో కూడా మొదట సమంతనే అనుకున్నాడు శేఖర్ కమ్ముల. కానీ తరువాత ఆమె ప్లేసులో సాయి పల్లవి వచ్చి చేరింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకులా రెండు కాదల్’, తెలుగు చిత్రం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.