Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత కొత్త ప్రాజెక్టులను సమంత పెద్దగా ఒప్పుకోవడం లేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ బారిన పడి ఆరు నెలలు సినిమా షూటింగ్లకు దూరమైంది. ఆ సమయంలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అనంతరం మార్చి నెలలో కొద్దిగా కోలుకొని అప్పటికి ఒప్పుకున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం జరిగింది. మొన్నటిదాకా విదేశాలలో చక్కర్లు కొడుతూ రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్స్ లేకపోయినా గాని సోషల్ మీడియా విభాగంలో పలు ప్రమోషన్ ల ద్వారా చేతినిండా డబ్బులు సంపాదిస్తూ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా.. టాప్ మోస్ట్ బజార్ మ్యాగజైన్ కోసం ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తూ గ్లామర్ డోస్ పెంచేస్తూ కెమెరాలకు సమంత ఫోజులిచ్చింది. ఏకంగా బికినీ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో రెచ్చిపోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత అందాల విషయంలో సమంత హద్దులు లేకుండా రెచ్చిపోతున్నారు. బజార్ మ్యాగజైన్ కోసం ఏకంగా బికినీ అందాలతో.. సమంత పూర్తిగా ఓపెన్ కావడం జరిగింది. సమంతా లేటెస్ట్ హాట్ ఫోటోలు ముందు ఏ బాలీవుడ్… హాలీవుడ్ హీరోయిన్ కూడా సరిపోదు అన్న రీతిలో ఉన్నాయి. ఈ మధ్య సినిమాలకు దూరమైన గాని సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ప్రస్తుతం సామ్ దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉందట. అక్కడి ప్రాజెక్టులను వినటానికి ఇష్టపడుతూ ఉందట. అంతా ఓకే అయితే బాలీవుడ్ తర్వాత హాలీవుడ్ వైపుగా వెళ్లే ఆలోచనలు సమంత చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. సమంత నటించిన చివరి సినిమా “ఖుషి” సెప్టెంబర్ నెలలో విడుదలయ్యింది. వరుస ప్లాపులలో ఉన్న క్రమంలో “ఖుషి” సినిమా హిట్ కావడంతో.. ఊపిరి పీల్చుకున్న సమంత.. ప్రస్తుతం విదేశాలలో రిలాక్స్ అవుతూ ఉంది. ఒక ఏడాది పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండి.. మయోసైటీస్ నుండి పూర్తిగా కోలుకునే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.