Samantha: “ఏం మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ని సంపాదించింది. అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అనేక భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అప్పట్లో సాధించింది. పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది”, మహేష్ బాబుతో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి ఇంకా అనేకమంది టాప్ హీరోల సరసన నటించి సమంత టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా అప్పట్లో మారిపోయింది.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య ని ప్రేమ వివాహం చేసుకుని చాలా వరకు సినిమాలకు గ్లామర్ రోల్ పాత్రలకు దూరమయి… హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కెరియర్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఒకపక్క బుల్లితెరపై రాణిస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సమంత బాలీవుడ్ స్టార్ హీరో గురించి తన మనసులో మాట బయట పెట్టింది. తనకి బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టమని.. చాన్స్ వస్తే అతనితో కచ్చితంగా యాక్ట్ చేస్తాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో… చెప్పుకొచ్చింది.
ఇప్పటివరకూ దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో విభిన్న పాత్రలు పోషించిన సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్ వస్తే ఏంటి అన్న దానిపై సంచలన కామెంట్ చేసింది. గతంలోనే తనకి బాలీవుడ్ నుండి అనేక ఆఫర్లు వచ్చినట్లు.. ఆ సమయంలో డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక వదులుకున్నట్టు తెలిపింది. ఒకవేళ నిజంగా చాన్స్ వస్తే ఖచ్చితంగా రణబీర్ కపూర్ తో సినిమా చేస్తాను ఆన్ స్క్రీన్ రొమాన్స్ అయితే ఇంకా బాగుంటుంది అంటూ సామ్ ఓపెన్ అయిపోయింది.