Samantha: సమంత.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నాగ చైతన్యతో విడాకుల అనంతరం అమ్మడు పని అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతివలె సమంత ఫుల్ స్వింగ్ లో పెద్ద పెద్ద సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా వుంది. ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 పొజిషన్‌కి సమంత చేరింది అనడంలో అతిశయోక్తి లేదు. అటు పెద్ద హీరోల సరసన నటిస్తూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపైన కూడా టార్గెట్ చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ గురించి అందరికీ విదితమే కదా.
Samantha: సమంతని చాలా తక్కువ అంచనా వేశాము నాయనో.. ఏం చేసిందో చూడండి!
Samantha: సమంత సోషల్ మీడియా పోస్టులు చూసిన కొంతమంది ఇలా అనుకున్నారు!
చేతో సామ్ విడాకుల అనంతరం కొంచెం డిప్రెస్సివ్ మైండ్ తో సామ్ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. వీటిని చూసిన సో కాల్డ్ అక్కినేని అభిమానులు అంటే సామ్ ను సోషల్ మీడియా వైదికగా టార్గెట్ చేసారు. ఇక సామ్ పని అయిపోయిందని అంటూ నోరు పారేసుకున్నారు. కానీ నవ్విన నాపచేనే పండుతుంది అన్న మాదిరిగా సమంత మంచి మంచి ప్రాజెక్టులకు సైన్ చేస్తూ ముందుకు దూసుకు పోతోంది. అంతే కాకుండా స్టార్ హీరోలకు సైతం ఫస్ట్ ఛాయిస్‌గా మారుతోంది సమంత.
Samantha: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు ఇదే అతి పెద్ద గుడ్ న్యూస్..
సామ్ చేయబోనే నెక్స్ట్ సినిమాల జాబితా ఇదే!
చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు కమర్షియల్ సినిమాలను సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా NTR, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో సమంతనే లీడ్ హీరోయిన్గా తీసుకున్నట్టు సమాచారం. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సామ్ నే హీరోయిన్ గా ఫైనల్ చేయనున్నారని వినికిడి. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినటువంటి శాకుంతలం, యశోధ సినిమాలు ఉండనే వున్నాయి. సో దీన్ని బట్టి అర్ధం అయినదేంటి.. సమంత జోరు తగ్గలేదనేగా!
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!