Samantha: హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస పెట్టి షూటింగ్ లలో పాల్గొంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్‌పరంగా సమంత మరింత బిజీ అయిపోయింది. ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరో పక్క విజయ్ దేవరకొండతో “ఖుషి” అనే డిఫరెంట్ లవ్ స్టోరీ నేపథ్యం కలిగిన సినిమా నటిస్తోంది. ఇదిలా ఉంటే సమంత షూటింగ్ లలో లేని సమయంలో ఎక్కువగా జిమ్ లేదా పెంపుడు జంతువులతో గడుపుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో పెంపుడు జంతువులతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ రకరకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటది. ఏ రీతిగానే తాజాగా తన పెంపుడు సమంతా ఒక ఫోటో దిగి పోస్ట్ చేయగా దానికి ఓ నెటిజన్… ఫోటో కింద కామెంట్ పెడుతూ..” ఆమె పిల్లులు అదేవిధంగా కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి అని రాసుకొచ్చాడు. అనూహ్యంగా సమంత ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చి అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలగా భావిస్తాను అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తంమీద చూసుకుంటే మనుషులకంటే పెంపుడు జంతువులే కరెక్ట్ అన్న రీతిలో సమంత రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలావరకు ఎక్కడా కూడా డౌన్ కాకుండా… కెరియర్ పరంగా బిజీ అవుతుంది. వరుసపెట్టి సినిమాలను ఒప్పుకుంటూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్వరలో పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో ఐటెం సాంగ్ లో సమంత కనిపిం చడం జరిగింది ఆ పాట సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. అయితే రెండో భాగంలో సమంతా కి ఒక కీలకమైన పాత్ర సుకుమార్ డిజైన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!